ధనుష్ వాతి హక్కులను సొంతం చేసుకున్న వరిసు డిస్ట్రిబ్యూటర్స్.!

Divya
వెంకీ అట్లూరి రచన దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ డ్రామా చిత్రం వాతి.. తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో షూట్ చేయబడుతోంది.. సితార ఎంటర్టైన్మెంట్ ఫర్ సినిమాస్.. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ హీరోగా.. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. 2023 ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాను నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉండడంతో సినిమా నుంచి పోస్టర్లు విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాలి అని ముందుగా ప్రకటించారు.. కానీ చిత్ర నిర్మాతలు ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ఫిబ్రవరి 17 నాటికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.  అయితే ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రముఖ సంగీత స్వరకర్త జీవీ ప్రకాష్ వెల్లడించారు. ఈ సినిమాలో ధనుష్ బాలమురుగన్ అనే ఉపాధ్యాయుడు పాత్ర పోషిస్తున్నాడు. అతను భారతీయ విద్యా వ్యవస్థలోని అన్ని లొసుగులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడబోతున్నారు. ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ నవంబర్ చివరి వారంలో విడుదల అవ్వగా మంచి విశేష ఆదరణ పొందింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న బై లింగ్వల్ సినిమా వారిసు యొక్క తమిళ్ హక్కులను తమిళనాడులో కైవసం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ 7 స్క్రీన్ స్టూడియో వారు ధనుష్ యొక్క వాతి సినిమా తమిళనాడు హక్కులను సొంతం చేసుకున్నారు. వారసుడు సినిమాతో విజయాన్ని అందుకోబోతున్న సెవెన్ స్క్రీన్ స్టూడియో వారు ధనుష్ వాతి సినిమాతో కూడా మరో విజయాన్ని అందుకోబోతున్నట్లు సమాచారం . అయితే ధనుష్ నటిస్తున్న ఈ వాతి సినిమాను తెలుగులో సార్ పేరిట రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: