ఆ విషయంలో కమల్ హాసన్ మూవీని వెనక్కునెట్టేసిన లైగర్ మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అనన్య పాండే ఈ మూవీలో హీరోయిన్ గ నటించగా , మైక్ టైసన్ ఈ మూవీలో ఒక కీలకపాత్రలో నటించాడు. రమ్యకృష్ణ ఈ మూవీలో విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించింది.

ఈ మూవీని పూరి జగన్నాథ్ మరియు కరణ్ జోహార్ లు కలిసి పూరి కానెక్ట్స్ ... ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీని కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయగా ఈ మూవీ ఏ భాషలో కూడా ప్రేక్షకులను అలరించలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోర పరాజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర గోర పరాజయాన్ని అందుకున్న లైగర్ మూవీ కొన్ని రోజుల క్రితమే స్టార్ మా టీవీలో టెలికాస్ట్ అయింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం అందుకున్న ఈ సినిమా స్టార్ మా లో ప్రసారం అయినప్పుడు 6.68 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే లోక నాయకుడు కమల్ హాసన్ ఈ సంవత్సరం విక్రమ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న అందరికీ తెలిసిందే. విక్రమ్ మూవీ కంటే కూడా లైగర్ మూవీ కి ఎక్కువ "టి ఆర్ పి" రేటింగ్ రావడం అనేది విశేషం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి మూవీలో హీరోగా నటిస్తున్నాడు. సమంత ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: