సంక్రాంతిని టార్గెట్ చేసిన శృతిహాసన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటువంటి శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కెరియర్ ప్రారంభంలో ఎన్నో అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుకొని ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న శృతిహాసన్ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని బ్లాక్ బాస్టర్ హీరోయిన్ గా పేరును తెచ్చుకుంది.

ఆ తర్వాత నుండి శృతిహాసన్ ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా అవకాశాలను దక్కించుకొని ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం క్రాక్ మరియు వకీల్ సాబ్ మూవీలతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీలలో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీలు రెండు కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు మూవీలపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలకు తగ్గినట్టుగా భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సాధించినట్లు అయితే శృతిహాసన్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీలను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించడం ఒక విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: