కనెక్ట్ , లాఠీ మూవీలు బాక్స్ ఆఫీస్ వద్ద అవతార్ 2 ను దాటనట్టేనా..?

Divya
ప్రముఖ లేడీ సూపర్ స్టార్ నయనతార..ప్రముఖ దర్శకుడు అశ్విన్ శరవనన్ దర్శకత్వంలో నయనతార.. విగ్నేష్ శివన్ సొంత బ్యానర్ అయిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన హారర్ చిత్రం కనెక్ట్.. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ ,వినయ్ రాయ్ తదితరులు కీలకపాత్రలో పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలైంది . 99 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా బ్రేక్ లేకుండా థియేటర్లలో ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అవతార్ 2 ను మించి ప్రేక్షకులను మెప్పించ లేకపోవడం గమనార్హం. ఒకరకంగా చెప్పాలి అంటే అవతార్ 2 సినిమా వల్ల ఈ సినిమాకు భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు. తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద కనెక్ట్ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇక విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కూడా నిన్న థియేటర్లలో చాలా గ్రాండ్గా విడుదల అయింది . ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అయితే అందుకుందని చెప్పాలి.. అయితే అవతార్ 2 ను మించి విజయాలైతే సాధించలేదు.  ఐఎండిబి నుంచి 8.5 రేటింగ్ పొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది . అయితే హైదరాబాదులో విడుదల కాగా ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు ఇప్పటికీ ఆ ప్రేక్షకులు అవతార్ 2 సినిమాకే పట్టం కడుతూ ఉండడం గమనార్హం.
అటు నయనతార కనెక్ట్.. ఇటు విశాల్ లాంటి రెండు సినిమాలు కూడా తమిళ్లో విడుదలై అక్కడి నుంచి డబ్బింగ్ ద్వారా తెలుగులో ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. అయితే తమిళ్లో ఈ సినిమాలు భారీ విజయాన్ని అందుకోగా తెలుగులో మాత్రం అంతంత  మాత్రమే ఆడుతున్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ రెండు సినిమాల కథ, కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ అవతార్ 2 ను మించి లేవన్నట్టుగా ప్రజలు విశ్వసిస్తున్నారు . ఈ రెండు సినిమాలకి అవతార్ 2 భారీ దెబ్బకొట్టిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: