వైరల్ అవుతున్న ఉర్ఫీ జావెద్ హాట్ ఫోటో షూట్...!!

murali krishna
బాలీవుడ్ హాట్ బ్యూటీ అయిన ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఫ్యాషన్ కే కేరాఫ్ అన్నట్లు తన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఎవ్వరికైన దిమ్మ తిరగాల్సిందే.
ఒకసారి ఒంటినిండా పిన్నీసులను కప్పుకొని కనిపించింది. టేప్ కప్పుకొని కూడా కనిపించింది.. అసలు ఒంటిమీద అమ్మడికి బట్టలు నిలవవు అంటే నమ్మశక్యం కాదు. ఇలా చేస్తున్నందుకు సిగ్గు లేదా అంటే దానికి ఈ భామ చెప్పిన సమాధానం వింటే అస్సలు షాక్ అవ్వకుండా ఉండలేరు. నేను ఇలా ఉంటేనే నాకు నేమ్ అలాగే ఫేమ్ వచ్చాయి.. అందుకే నేను ఇలాగే ఉంటాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం.దుబాయ్ లో ఒక ప్రాంతంలో ఉర్ఫీ తనదైన స్టైల్లో ఫోటోషూట్ చేస్తూ కనిపించిందట. ఒంటిపై అస్సలు బట్టలు లేకుండా ఒక వింత వేషధారణతో ఫోటోషూట్ చేస్తూ కనిపించడంతో దుబాయ్ పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి . అయితే ఆ వార్తలో నిజం లేదని ఉర్ఫీ స్పందించింది.
“నన్నెవరు అరెస్ట్ చేయలేదు దుబాయ్ లో నా ఫోటో షూట్ ను మాత్రం పోలీసులు అడ్డుకున్నారు.. కానీ, అది నా బట్టల వలన అయితే కాదు. ఆరోజు లొకేషన్‌లో కొన్ని సమస్యల తలెత్తాయి కారణంగా, షూటింగ్‌ని ఆపడానికి  అయితే పోలీసులు వచ్చారు. నిర్మాణ బృందం మాకు షూటింగ్‌కు అనుమతించిన సమయాన్ని మాత్రం పొడిగించలేదు, ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేస్, కాబట్టి మేము బయలుదేరాల్సి అయితే వచ్చింది. దానికి నా బట్టలతో ఎలాంటి సంబంధం అయితే లేదు. మేము మిగిలిన సన్నివేశాలను మరుసటి రోజు చిత్రీకరించాము కాబట్టి సమస్య కూడా తీరిపోయింది”అని  ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉర్ఫీ అరెస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: