ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పులపాలు కావడానికి కారణం అదేనా...?

murali krishna
రమణ గోగుల సంగీతం పైన ఉన్న ఆసక్తి తో మొదట మిస్టి రిథమ్స్ అనే బ్యాండ్ తో కలిసి ఆయన పని చేసేవాడు. ఆ క్రమంలో ఇండీ పాప్ స్టూడియో వారికి ఆయే లైలా అనే ఒక మ్యూజిక్ ఆల్బం కూడా చేసి పెట్టారు.
అది బాగా హిట్ అవ్వడంతో అక్కడ మొదలు పెట్టిన తన ప్రయాణం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అతడిని ఒక మంచి సంగీత దర్శకుడిగా అలాగే గేయ రచయితగా, నిర్మాతగా మరియు గాయకుడిగా మార్చేసింది.
తెలుగు వాడైన కూడా తనకు ఖరగ్ పూర్ ఐఐటి లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా కి పై చదువుల కోసం వెళ్లి లూసియానా స్టేట్ లోని యూనివర్శిటీ నుండి ఎం ఎస్ పూర్తి చేసి అక్కడే టెక్కీ గా ఉద్యోగం చేస్తూనే స్టార్ట్-అప్ కంపెనీ కూడా ఆయన పెట్టాడు. ఆ తర్వాత 1995 లో ఇండియా కి తిరిగి వచ్చి మొదట వెంకటేష్ సినిమా అయిన ప్రేమంటే ఇదేరా సినిమాకి మంచి సంగీతం అందించాడు. ఆ సినిమా మ్యూజికల్ గా మంచి మార్కులు వేయించుకోవడం తో రమణ గోగుల మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తమ్ముడు, బద్రి, జానీ మరియు అన్నవరం సినిమాలకు కూడా సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రాలన్నీ కూడా మ్యూజికల్ గా గొప్ప పేరు తెచ్చుకున్నాయి. వెంకటేష్ తో మరో సారి లక్ష్మి సినిమాకు కూడా సంగీతం అందించి సూపర్ హిట్ ని అందించాడు.
ప్రభాస్ కి యోగి సినిమాకు కూడా సంగీత దర్శకత్వం చేపట్టిన రమణ గోగుల కొన్ని కన్నడ మరియు తమిళ సినిమాలకు కూడా పని చేయడం జరిగింది.మహేష్ బాబు నటించిన యువరాజు కి కూడా సాంగ్స్ అన్ని రమణ కంపోజ్ చేయగా, సుమంత్ తో ఒక సినిమా కూడా ఆయన నిర్మించాడు. ఆ సినిమా పేరు బోణి. ఈ సినిమా ఫ్లాప్ కావడం తో రమణ గోగుల అప్పుల పాలయ్యాడని సమాచారం.. ఇక తేజ చిత్రం అయిన 1000 అబద్దాలతో మల్లి పూర్వ వైభవం తెచ్చుకోవాలన్న ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం తో తిరిగి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ ప్రస్తుతం క్లీన్ టెక్నాలజీ ఇన్నవోషన్ ఎట్ స్టాన్లే బ్లాక్ డెక్కర్ కి మరియు వెంచర్ పార్ట్నర్ ఎట్ అంథిల్ వెంచర్ కి వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తూ తాను పోగొట్టుకున్న డబ్బులను తిరిగి సంపాదించాడు. ఆయన మళ్ళీ తిరిగి సినిమాలలోకి రావాలని చూస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: