తునివు: ట్రైలర్ అప్పుడే?

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్ హీరోగా అజిత్ కుమార్‌కు అసామాన్యమైన క్రేజ్ ఉంది. అజిత్ కుమార్ నటించే సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి దగ్గరైన అజిత్ కుమార్ ఇప్పుడు తన కొత్త సినిమా అయిన తునివుతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు.సంక్రాంతి కానుకగా ఈ సినిమా భారీగా రిలీజ్ కానుంది.తునివు టైటిల్ తో తమిళంలో సందడి చేయనున్న అజిత్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే తెగింపు అనే టైటిల్‌తో విడుదల అవుతుంది. అజిత్‌ కుమార్ సినిమాలకు కోలీవుడ్‌లో ఏ హీరోకి కూడా లేనటువంటి మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో కూడా అజిత్ సినిమాలు బాగానే ఆడతాయి. ఇప్పుడు సంక్రాంతి బరిలోకి  అజిత్ రాబోతోన్నాడని తెలియడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంకా అజిత్ సన్నిహితుడు అయిన బోనీ కపూర్ ఇంకా జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా.. హెచ్ వినోద్ ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. 


ప్రముఖ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా ఈ సినిమాకి కెమెరామెన్‌గా పని చేశారు.ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే నూతన సంవత్సరం కానుకగా జనవరి 1 న పొద్దున్నే 12 గంటలకు విడుదల అవుతుందని సమాచారం తెలుస్తుంది.రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా అలాగే ఐవీవై ప్రొడక్షన్ సంయుక్తంగా తెగింపు సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. సంక్రాంతికి విడుదల అవుతున్నట్లు మేకర్లు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో అజిత్ కుమార్ చాలా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన అఫీషియల్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖణి వంటి నటీ నటులు నటిస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: