#తలైవార్ 170 కి దర్శక నిర్మాతలు మారిపోయారా..?

Divya
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ. 150 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధం కాబోతోందని సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పుడు రజినీకాంత్ మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. #తలైవార్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా మొదలు కాబోతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మొదట డాన్ సినిమా దర్శకుడు సి.బి. చక్రవర్తి దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించారు.
అంతేకాదు పోన్నియన్ సెల్వన్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని కూడా వార్తలు వినిపించాయి.కానీ తాజాగా అందుతున్న  సమాచారం ప్రకారం ఈ సినిమాను.. ఏజిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో లవ్ టుడే సినిమా దర్శకుడు  ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తాజా సమాచారం అందుతోంది. ఏ జి ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను కళావతి ఎస్ అఘోరం నిర్మించనున్నారు. అయితే ప్రదీప్ రంగనాథన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లవ్ టుడే సినిమాను కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా ఈ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

దీని బట్టి చూస్తే ఆయన సత్తా ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.  అందుకే ఇప్పుడు తన తదుపరిచిత్రాన్ని రజనీకాంత్ తో చేసే అవకాశాన్ని సంపాదించారు. మరి ఈ సినిమాతో రజినీకాంత్ కు మరో బ్లాక్ బాస్టర్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో 31 సంవత్సరాల తర్వాత అరవిందస్వామి.. 14 సంవత్సరాల తర్వాత వడివేలు రజనీకాంత్ తో జతకట్టనున్నారు.  మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: