విశాల్ "లాఠీ"తో బాక్స్ ఆఫీస్ వద్ద గర్జిస్తాడా ?

VAMSI
టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో గుర్తింపు సంపాదించుకుని కొత్త కథలతో మన ముందుకు వస్తున్న హీరో విశాల్. ఇతను పేరు విన్నా లేదా ఇతనిని చూసినా ప్రతి ప్రేక్షకుడికి ఫుల్ మాస్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ ఈ మధ్య తాను చేసిన సినిమాలను చూస్తే కొంచెం తన స్టైల్ ను మార్చి స్టైలిష్ మరియు థ్రిల్లర్ డిటెక్టివ్ కథలను ఎంచుకుంటున్నాడు. అలా వచ్చిన సినిమాలలో అభిమన్యు, డిటెక్టివ్ మరియు ఎనిమీ లు ఉన్నాయి. ఫలితాలతో సంబంధం లేకుండా విశాల్ ఏదోకటి ట్రై చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మరో కొత్తరకమైన కాన్సెప్ట్ తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
కథ పరంగా చూస్తే ఒక సాధారణ కానిస్టేబుల్ గా వ్యవస్థలో ఏ విధంగా మార్పును తీసుకువచ్చాడు అన్నది ఇతివృత్తము. దానికి ప్రేక్షకులకు సరిగ్గా అట్రాక్ట్ అయ్యే టైటిల్ "లాఠీ" అన్న పేరుతో మన ముందుకు రానున్నాడు విశాల్. ఈ సినిమాను మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 22 వ తేదీన థియేటర్ లలోకి తీసుకు రానున్నారు. ఈ సినిమా తమిళ్ మరియు తెలుగు భాషలలో రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సినిమాపై అంచనాలు ఉన్నాయి... ట్రైలర్ లో విశాల్ నటనలో విశ్వరూపం చూపించాడని చెప్పాలి.  
ఇప్పటి వరకు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో సినిమా బృందం చెప్పినట్లు ఇందులో విశాల్ తన కెరీర్ లోనే ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ లను చేశాడట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే 45 నిముషాల యాక్షన్ హైలైట్ అట. చాలా రోజుల తర్వాత పోలీస్ గా నటిస్తున్న విశాల్ లాఠీ సినిమాలో కానిస్టేబుల్ గా గర్జిస్తాడా ? అన్నది రెండు రోజుల్లో తెలియనుంది.  కాగా ఇందులో విశాల్ కు జోడిగా సునైనా నటింస్తుండగా, వినోద్ కుమార్ ఈ సినిమాను ఒక మంచి యాక్షన్ చిత్రంగా మలిచారట. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: