అక్కడ షూటింగ్ కు రిక్వెస్ట్ పెట్టుకున్న కంగనా..!

Pulgam Srinivas
బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనోత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కంగనా చాలా సంవత్సరాల క్రితం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏక్ నిరంజన్ మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న కంగనా అందులో భాగంగా ప్రస్తుతం రాఘవ లారెన్స్ హీరో గా పి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ చంద్రముఖి 2 లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అజరాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు ప్రస్తుతం కంగనా రనౌత్ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఎమర్జెన్సీ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో కంగనా నటించడం మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను పార్లమెంటు లోపల షూట్ చేసేందుకు అనుమతించాలి అని కంగనా లోక్ సభ కార్యాలయాన్ని కార్యాలయాన్ని కోరినట్లు తెలుస్తుంది. అయితే ఆమెకు పార్లమెంట్ అనుమతి ఇవ్వకపోయే అవకాశం ఎక్కువ శాతం ఉంది అని తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం ... పార్లమెంట్ లోపల ప్రైవేట్ వ్యక్తులు ... సంస్థలు షూటింగ్ చేసుకునేందుకు వీల్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: