"18 పేజెస్" రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ ఇప్పటికే ఈ సంవత్సరం కార్తికేయ 2 మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. చందు మండేటి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. చాలా సంవత్సరాల క్రితం విడుదలైన కార్తికేయ మూవీ కి ఈ సినిమా సీక్వెల్ గా తేరకక్కడంతో కార్తికేయ 2 మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 100 కోట్లbకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా కార్తికేయ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నిఖిల్ "18 పేజీస్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా యూనిట్ ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి 18 పేజెస్ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఎలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. 18 పేజెస్ మూవీ 2 గంటల 17 నిమిషాల మామూలు నిడివి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: