తెలుగు అమ్మాయిల అదరగొడుతున్న శ్రీముఖి..!!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ శ్రీముఖి. తన అందం అభినయంతో చలాకితనంతో ఎంతమంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి షోలో నైనా సరే తన కామెడీ పంచులతో అక్కడున్న వారందరిని నవ్విస్తూ ఉంటుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే వెండితెర పైన ఒక వెలుగు వెలగాలని హీరోయిన్గా ప్రయత్నించిన అంతగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో అడపా దడప్ప సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక బిగ్ బాస్ సీజన్-3 లో శ్రీముఖి తన సత్తా చాటింది. దీంతో తను ఎక్కడైనా సరే గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. బిగ్ బాస్ లో తొలిసారిగా మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా ఎక్కువగా వినిపించాయి. కాని చివరికి రన్నర్ తో సరిపెట్టుకుంది. శ్రీముఖి గత సంవత్సరం క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా అడల్ట్ కామెడీ అంశంతో తెరకెక్కించారు. ఇక నితిన్ నటించిన మ్యాస్త్రో సినిమాలో శ్రీముఖి నటించింది ఈ చిత్రం ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఇక సోషల్ మీడియాలో తరచు తన గ్లామర్ తో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన హాట్ అప్పీయరెన్స్ తో కుర్రాలని ఆకర్షిస్తూ ఉంటుంది. చూడడానికి కాస్త బోద్దుగా కనిపించిన శ్రీముఖి ఈమధ్య కాలంలో తన అందంతో నాజూకైన శరీరంతో బాగా ఆకట్టుకుంటోంది. శ్రీముఖి గ్లామర్ విషయంలో ఎప్పుడు హాద్దులు చేరిపేసిందని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు చూస్తే మనకి అర్థమవుతుంది. స్టార్ హీరోయిన్లకు దీటుగా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది శ్రీముఖి. ఇప్పుడు తాజాగా నిండైన చీర కట్టులో అద్భుతమైన ఫోజులిచ్చింది శ్రీముఖి ముఖ్యంగా గ్లామర్ బాస్టింగ్ కి చిన్న గ్యాప్ ఇస్తే ఇలా అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: