సంక్రాంతికి ఆ రెండు చిన్న సినిమాలు కూడా..!

Pulgam Srinivas
ప్రతిసారి సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సినిమాల పోరు జరుగుతూ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరో ల మధ్య భారీ బాక్స్ ఆఫీస్ యుద్ధం జరగడానికి రెడీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరో లుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున విడుదల కావడానికి రెడీగా ఉంది.

అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన మరో సీనియర్ స్టార్ హీరో అయినటు వంటి నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ లతో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి అజిత్ హీరో గా తెరకెక్కిన తుని , తలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు మూవీ లు కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక విడుదల కానున్నాయి. ఇలా ఈ స్టార్ హీరోల సినిమాల మధ్యలో ఓ రెండు చిన్న తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ హీరోగా ప్రియ భవాని శంకర్ హీరోయిన్ యు వి క్రియేషన్ సంస్థ నిర్మించిన కళ్యాణం కమనీయం సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో పాటు యువ కథానాయకుడు రాహుల్ విజయ్ , యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని జోడిగా నటించిన మూవీ విద్య వాసుల అహం ను కూడా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: