బాస్ పార్టీ సక్సెస్ పై చిరు రియాక్షన్ వైరల్?

Purushottham Vinay
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలున్నాయి. మంచి మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో మాస్ మాహారాజా రవితేజ కూడా కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీపై భారీగా హైప్ పెరిగింది.ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మూవీ మేకర్స్. అలాగే పోస్టర్స్, టీజర్ ఇంకా సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా వాల్తేరు వీరయ్య టీం నుంచి చిరు లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.  ఇందులో అయితే బాస్ తన ప్రాంగణంలో అంతా గన్స్ ఇంకా అలాగే చేతికి సంకెళ్లు చూస్తుంటే ఓ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లా ఇది అందరికి అనిపిస్తుంది. అలాగే ఇందులో చిరంజీవి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.ఇక మరోవైపు గురువారం నాడు విడుదల చేసిన బాస్ పార్టీ మేకింగ్ వీడియో కూడా ఆకట్టుకుంటుంది.


ఇంకా ఇందులో బాస్ పార్టీని చిరు ఓ రేంజులో ఆస్వాధిస్తున్నట్లుగా చూస్తుంటే అర్థమవుతోంది. దర్శకుడు బాబీతోపాటు చిరు ఉండగా.. టీంలో సుకుమార్ కూడా కనిపించారు. అలాగే ఇంకా మైత్రి నిర్మాతలు కూడా ఉన్నారు. తాజాగా విడుదలైన వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ పాటను పాడుతున్నప్పుడు బాస్ పార్టీ వైబ్ ఆస్వాధిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చాలా జోష్ తో గొంతు కలుపుతూ కనిపించారు. చిత్రయూనిట్ ఈ సాంగ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ బాగా హల్చల్ చేస్తుంది.ఇక ఈ మూవీలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఇదే కాకుండా భోళా శంకర్ సినిమాలోనూ చిరు నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే.. చాలా కాలం తర్వాత సంక్రాంతికి చిరు ఇంకా బాలయ్య మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. . అయితే ఈమధ్య కాలంలో ఇరువురి ఫ్యాన్స్ కూడా సంక్రాంతి మూవీల బంపర్ హిట్ కి సహకరించే మూడ్ లో ఉన్నట్టే కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: