నెట్ ఫ్లిక్స్ లో RRR ఇంగ్లీష్ వెర్షన్.. కాంతారా కూడా అదే దారిలోనే..!

Divya
ఇదే ఏడాది మార్చి నెలలో అంగరంగ వైభవంగా భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం ఆర్.ఆర్.ఆర్ గురించి.. ఆ సినిమా సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దేశ విదేశాలలో ఉన్న ప్రముఖ రైటర్స్, క్రిటిక్స్, డైరెక్టర్ అందరూ కూడా రాజమౌళిని ప్రశంసల వర్షం లో ముంచేత్తుతున్నారు.

అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళికి మరో అరుదైన గుర్తింపు కూడా లభించింది. ఇంగ్లీష్ మ్యాగజైన్లో ఆయన ఫోటో ప్రింట్ చేసి మరీ వైరల్ చేయడం గమనార్హం.. జపాన్ లో విడుదల చేసిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు.  అందులో భాగంగానే ఇంగ్లీష్ వర్షన్ కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ప్రసారమవుతోంది. ఒకరకంగా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు కాంతారా సినిమా కూడా ఇదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది.  కాంతారా ఇంగ్లీష్ వర్షన్ కి కూడా నెట్ ఫ్లిక్స్ ప్రసార వేదిక అవుతూ ఉండడం గమనార్హం.  ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . కేవలం రూ.16 కోట్ల బడ్జెట్తో ఏకంగారూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజలను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్ లో కూడా  నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఈ సినిమాలో హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి కి మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: