"ఏజెంట్" మూవీలో ఏకంగా అన్ని యాక్షన్ ఎపిసోడ్లు..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఆఖరుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ పూజ హెగ్డే , అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , హిప్ హాప్ తమిజ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని పని ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ని తెలుగు ,  తమిళ , కన్నడ , మలయాళ ,  హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఏజెంట్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ లో అదిరిపోయే స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ లు 8 ఉండబోతున్నట్లు తెలుస్తోంది  ఈ 8 యాక్షన్ ఎపిసోడ్ లు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: