అవతార్ 2: తెలుగు డైలాగ్స్ తో అదరగొట్టేసిన అవసరాల.!

Divya
సినీ ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న ఏకైక చిత్రం అవతార్ 2.. ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం ఆసన్నమైంది.. ముఖ్యంగా మన ఇండియాలో కూడా ఈ సినిమా కోసం కోట్లాదిమంది ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ తారస్థాయికి చేరుకుంది. ఏకంగా రూ.1600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా విపరీతమైన కలెక్షన్స్ వసూలు చేసుకుంటుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పదులకోట్ల రూపాయలు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చినట్లు కూడా సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సినిమాను భారీ ఎత్తున డిసెంబర్ 16వ తేదీన రిలీజ్ చేయాలి అని డిస్నీ వారు నమ్మకంగా ఉన్నారు.

మొత్తానికి అయితే ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ అయినప్పటికీ సన్నివేశాలకు... పాత్రల తీర్పుకు తగ్గట్టుగా ఆకట్టుకునే డైలాగ్స్ ఉండాలి అనే ఉద్దేశంతో మంచి రచయిత అనిపించుకున్న యంగ్ హీరో అవసరాల శ్రీనివాసరావుతో  డైలాగ్స్ రాయించారట. ముఖ్యంగా సన్నివేశాలకు తగినట్టుగా తన కలానికి పదును పెట్టి మరి సినిమా కోసం డైలాగ్స్ రాసే అవసరాలు శ్రీనివాస్ ఈ సినిమా కోసం మరింత కష్టపడినట్లు తెలుస్తోంది.. నటుడిగా , దర్శకుడిగా,  రచయితగా ఇప్పటికే ఎన్నో సక్సెస్ లను సొంతం చేసుకున్న అవసరాల శ్రీనివాస్ కి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.
అవతార్ 2 సినిమాతో జేమ్స్ కెమెరూన్ దాదాపు 12 సంవత్సరాల తర్వాత ప్రజల ముందుకు రాబోతున్నాడు. మండోరా ప్రపంచానికి మరోసారి ప్రేక్షకులను తీసుకువెళ్తున్నాడు. కాబట్టే ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.  ఇలాంటి సమయంలో తెలుగు వర్షన్ కు అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ రాశాడు అనే వార్తపై ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. కచ్చితంగా ఈ సినిమా రికార్డు బ్రేక్ చేస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: