సూపర్ స్టార్ రజినీకాంత్ బర్తడే స్పెషల్ జాతర..!

Divya
సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం తమిళనాడు ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ భారతదేశం మొత్తం తనదైన మార్క్, మేనరిజం, స్టైల్స్ తో అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా దేశ విదేశాలలో కోట్లాదిమంది అభిమానులను దక్కించుకున్న ఈయన జపాన్ లో కూడా అభిమానులను పొందడం గమనార్హం. ఇలా జపాన్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక తొలి ఇండియన్ హీరోగా రికార్డులోకి ఎక్కారు రజనీకాంత్.. అలాంటి రజిని పుట్టినరోజు వేడుకలు డిసెంబర్ 12న అంటే ఈరోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా అభిమానులు పూర్తి చేశారు.
ముఖ్యంగా రోజనీకాంత్ పుట్టినరోజు అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కే కాదు అభిమానులకు కూడా పెద్ద పండగే.. అందుకే అలాంటి పండగ కోసం ఆలయాలలో కూడా ప్రత్యేక పూజలు, రక్తదానాలు, నిరుపేదలకు అన్నదానాలు.. అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎప్పటిలాగే ఈసారి కూడా అన్ని కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఈరోజు 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోబోతున్నారు రజినీకాంత్ ఈ నేపథ్యంలోనే పివిఆర్ సంస్థ రజనీకాంత్ చిత్రోత్సవాల పేరుతో ఆయన నటించిన ప్రత్యేక సినిమాల ప్రదర్శనను డిసెంబర్ 9 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా కోయంబత్తూర్ చెన్నైలో రజనీకాంత్ నటించిన సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఈయన నటించి.. స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా రజినీకాంత్ స్వయంగా నిర్మించిన బాబా సినిమాను రీ మాస్టర్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు శివాజీ 2.0, దర్బార్ వంటి సినిమాలో కూడా ఈరోజు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇకపోతే రజినీకాంత్ నటించిన నిర్మించిన బాబా ఫోర్ కే రీమాస్టర్ చేసిన ప్రింట్ ఈరోజు చెన్నైలోని సత్యం థియేటర్లో ప్రత్యేకంగా ప్రివ్యూ వేసి ప్రదర్శించనున్నారు. 20 ఏళ్ల క్రితం చూసిన దానికి మించి పది రెట్లు సరికొత్త అనుభూతిని ఈ పిక్చర్ కలిగిస్తుంది అని థియేటర్లలో అభిమానులు చప్పట్లు ఈలలతో ఎంజాయ్ చేస్తారు అని లతా రజినీకాంత్ స్పష్టం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: