బాలయ్య తో ప్రభాస్ ఎపిసోడ్ వచ్చేది అప్పుడే..వీడియో..

Satvika
ఇద్దరు లెజెండ్ లను ఒకే ప్రేమ్ లో చూడాలంటే ఎవరూ మాత్రం ఆసక్తి చూపించరు.. ప్రభాస్ ఫ్యాన్స్ గురించి ఇక చెప్పనక్కర్లేదు.. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. నందమూరి నటసింహం బాలకృష్ణతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేయనున్నట్లు కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఒక డార్లింగ్ ఒకరే కాదు ప్రభాస్ తన ప్రాణ స్నేహితుడైన హీరో గోపీచంద్ కలిసి అన్ స్టాపబుల్ సీజన్ 2 కి రాబోతున్నట్లుగా హల్చల్ చేశాయి. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. పాన్ ఇండియా స్టార్ విత్ గాడ్ ఆఫ్ మాస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ రాబోతుందంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం వరుస లతో బిజీగా ఉన్న ప్రభాస్.. మొదటి సారి డిజిటల్ వేదికపైకి అరంగేట్రం చేయనున్నారు..దీంతో యావత్ సినీ లోకం ఎదురు చూస్తుంది.

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొననున్నారు డార్లింగ్. ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ప్రభాస్ ఒంటరిగానే వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు ప్రారంభంకాబోతున్నట్లు తెలుస్తోంది. వీరికి సంబంధించిన ఎపిసోడ్ న్యూయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం..ఈ వార్త విన్నప్పటి డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఎప్పుడూ చుద్దామా అని ఆసక్తి కనబరుస్తున్నారు..
 

కాగా,ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు.. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ చిత్రంపైనే ఉన్నాయి. ఇందులో డార్లింగ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది..ఈ సినిమాలన్నీ షూటింగ్ లో బిజిగా ఉన్నాయి..త్వరలోనే షూటింగ్ ను పూర్తీ చేసుకొని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: