పూరి జగన్నాథ్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ దాదా జిందాబాద్ మూవీ తర్వాత చాలా రోజుల పాటు సినిమా లకు దూరంగా ఉండి రాజకీయాలపై దృష్టి పెట్టిన చిరంజీవి చాలా కాలం గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 మూవీ తో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా ఖైదీ నెంబర్ 150 మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డి అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించి , ఈ మూవీ తో కూడా సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఆచార్య , గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో ఆచార్య మూవీ ప్రేక్షకులను నిరాశ పరచగా గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకులను అలరించింది.

ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. పూరి జగన్నాథ్ పాత్ర ఈ మూవీ లో నిడివి పరంగా తక్కువే అయినప్పటికీ ప్రేక్షకుల నుండి ఈ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. గతంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వం లో చిరంజీవి ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే పూరి జగన్నాథ్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కి ఆ కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: