పంచతంత్రం: క్వాలిటీ కాస్టింగ్ తో మెప్పించిందా?

Purushottham Vinay
మనకు ఎంతో ఇష్టమైన పంచతంత్రం అనే టైటిల్ తో  ఇవాళ ఓ సినిమా థియేటర్లలో అడుగుపెట్టింది. హర్ష పులిపాక దర్శకత్వంలో అయిదు కథల సమాహారంగా వచ్చిన మల్టీ స్టోరీ కాన్సెప్ట్ ఇది. ఈ సినిమాతో మంచి క్వాలిటీ కాస్టింగ్ తీసుకోవడంతో దీని మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి.మరి దానికి తగ్గట్టు ఈ సినిమా ఉందా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.


ఇక పంచేంద్రియాలను ఆధారంగా చేసుకుని స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీలో ఒక్కోదాని మీద ఒక్కో కథ చెప్పే రిటైర్డ్ రేడియో ఉద్యోగి వేదవ్యాస్ మాటల్లో ఈ సినిమా కథ సాగుతుంది. పని ఒత్తిడి వల్ల ఎంతగానో సతమతమయ్యే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంకా తన అభిరుచులకు తగ్గ అమ్మాయి కోసం వెతికే ఒక యువకుడు అలాగే నెలలు నిండిన కూతురి విషయంలో ఓ సమస్య ఏర్పడ్డ బ్యాంక్ ఎంప్లాయ్ ఇంకా క్యాన్సర్ సోకిన గర్భవతి భార్య విషయంలో ఆ జంట తీసుకునే నిర్ణయం ఇంకా అలాగే చిన్నపిల్లలకు ఆకట్టుకునేలా కథలు చెప్పే ఓ అమ్మాయి జీవితంలో ప్రవేశించిన పాప ఇలా మొత్తం అయిదు ప్లాట్లు తీసుకున్న వేదవ్యాస్ కాంపిటీషన్ లో గెలిచేలా వాటిని హత్తుకునేలా బాగా కథని చెబుతాడు. అది తెరమీద చూస్తే బాగుంటుంది.


ఇక ఈ సినిమా దర్శకుడు హర్షలో మంచి పొయెటిక్ సెన్స్ ఉంది. అందుకే సాధారణంగా ఎవరూ తీసుకోని ఈ పంచేంద్రియాలతో ఈ సబ్జెక్టుని రాసుకున్నాడు.అయితే టేకింగ్ విషయంలో మాత్రం మెప్పించినప్పటికీ అన్ని కథలను ఒకే టెంపోలో నడిపించడంలో తడబడ్డాడు.దానివల్ల ఓ రెండు కథలు మరీ నెమ్మదిగా సాగి ఆశించిన స్థాయిలో అనిపించవు. బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముతిరఖని, శివాత్మిక రాజశేఖర్ ఇంకా అలాగే నరేష్ అగస్త్య ఇలా సీనియర్ నుంచి జూనియర్స్ వరకు టాలెంటెడ్ క్రూని సెట్ చేసుకోవడం పంచతంత్రంని మరీ నెగటివ్ కాకుండా కాపాడింది. ఎక్కువ ఎంటర్ టైన్మెంట్, కమర్షియల్ అంశాలు ఆశించకుండా ఉంటేనే నచ్చే ఈ సింపుల్ సిరీస్ రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం అంతగా నచ్చకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: