బాలీవుడ్ వారసులు ఎంట్రీ ఇవ్వబోతున్నారా...!!

murali krishna
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్..ఏ వుడ్ అయినా..సినీ తారలకు ఉండే క్రేజే వేరు. సినీ తారలతో పాటు..వాళ్ల కుటుంబానికి ఆ క్రేజ్...ఫాలోయింగ్ రావడం సహజం.
అందుకే సెలబ్రిటీలు..తమ కుటుంబాన్ని సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. దేశంలోని ఏ సినిమా ఇండస్ట్రీలో చూసినా..తారల్లోని తర తరాల వారు సినిమాల్లో రాణిస్తుంటారు. ఇక బాలీవుడ్ లో వారసుల ఎంట్రీ అనేది అత్యంత సహజమైంది. బీటౌన్ లో హీరోలు..హీరోయిన్ల కొడుకులు, కూతుర్లు సినిమాల్లో నటిస్తుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది బాలీవుడ్ అగ్రనటుల వారసులు 2023లో తెరంగేట్రం చేయబోతున్నారు.
షారుఖ్ వారసుల ఎంట్రీ..
2023లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. షారూఖ్ ఖాన్-గౌరీల గారాలపట్టి సుహానా ఖాన్ నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'ది ఆర్చీస్'లో తొలిసారిగా నటిస్తోంది. ఈ సినిమా 2023లో విడుదలనుంది. ఇప్పటికే సుహానా ఖాన్..ది గ్రే పార్ట్ ఆప్ బ్లూ అనే షార్ట్ ఫింలో నటించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. దీనికి తోడు ఆమె న్యూయార్క్ లోని క్ష విశ్వ విద్యాలయంలో ఫిల్డ్ స్టడీస్ కోర్సు కూడా పూర్తి చేసింది. కొన్ని నాటకాలకు కథలు రాసింది.

హీరోగా కాదు..
షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ త్వరలో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే అతను దర్శకుడిగా మారనున్నాడు. స్వయంగా ఓ కథ రాసుకొని ఆర్యన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆర్యన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తొలి ప్రాజెక్టు కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని..ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఓ ఫీచర్ మూవీ కోసం కథ రాసినట్టు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా 2023లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కరణ్ జోహార్ 'హృదయం' రీమేక్‌లో అతను నటించనున్నాడని తెలుస్తోంది.

ది ఆర్చీస్‌ ద్వారా ముగ్గురు ఎంట్రీ..
దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నంద కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీరు జోయా అక్తర్‌ డైరెక్షన్‌లో ఓ వెబ్‌ ఫిలిం చేస్తున్నారు. కామిక్‌ బుక్‌ ఆర్చీస్‌ ఆధారంగా 'ది ఆర్చీస్‌' అనే మ్యూజిక్‌ డ్రామా తెరకెక్కుతోంది. 1960 నేపథ్యంలో టీనేజర్స్‌ కథలా ఆర్చీస్ నవల ఉంటుంది. ఈ సినిమా కూడా 2023లో విడుదలనుంది.

మిస్టర్ పర్పెక్ట్ వారసుడు..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ 'మహా రాజా' అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్‌ పి. మల్హోత్రా ఈ సినిమాకు డైరెక్టర్. 2023లో ఈ మూవీ విడుదల చేద్దామని ప్లాన్ లో ఉన్నారు. ఆమీర్‌ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌ కూడా 'మేదియా' అనే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా చేసింది.

సంజయ్ కూతురు కూడా...
మహీప్‌, సంజయ్‌ కపూర్‌ల కూతురు షానయా కపూర్‌ కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. తన సోదరి జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. ప్రస్తుతం 'బేధడక్‌' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ కూడా సినిమాల్లోకి వస్తోంది. ఆమె ఇప్పటికే హార్ది సంధు ఆల్బమ్ సాంగ్ 'బిజిలీ బిజిలీ ద్వారా మెప్పించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'లో పాలక్ తివారి కనిపించనుంది.
హృతిక్ రోషన్ మేనకోడలు పష్మీనా రోషన్ 'ఇష్క్ విష్క్' రీమేక్‌లో నటించనుంది. ఈ సినిమాలో రోహిత్ సరాఫ్, జిబ్రాన్ ఖాన్, నైలా గ్రేవాల్‌లు కూడా యాక్ట్ చేయనున్నారు. ఈ సినిమా 2023లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ కండల వీరుడు..సల్మాన్ ఖాన్..తన మేనకోడలు అలిజే అగ్నిహోత్రిను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్దమయ్యాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సౌమేంద్ర పాధి తర్వాతి చిత్రంలో ఆమె నటించనుంది. ఇక అలిజే అగ్నిహోత్రి యూకే లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఉన్నత చదువులు చదివినా కూడా సినిమాపై ఆమెకు ఆసక్తితో నటిస్తోంది. ఇప్పటికే ఆమె సోషల్ మీడియా ద్వారా అందరికి సుపరిచితం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: