"లైగర్" మూవీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు మూవీ తో సోలో హీరోగా మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత అనేక విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , అనన్య పాండే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

రమ్యకృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించగా , మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ని పూరి జగన్నాథ్ , కరణ్ జోహార్ లు సంయుక్తంగా పూరి కనక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. కాకపోతే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఘోరమైన నెగటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు దక్కలేదు. దానితో ఈ మూవీ కి దాదాపు ఈ మూవీ కి 62 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: