అజిత్ ఆఖరి 3 తెలుగు డబ్బింగ్ సినిమాల క్లోజింగ్ షేర్ కలక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అజిత్ తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే అజిత్ ఆఖరుగా నటించడం మూడు సినిమాలు తెలుగులో ఎన్ని కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేశాయో తెలుసుకుందాం.


అజిత్ ఆఖరుగా వలిమై అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని బోనీ కపూర్ నిర్మించాడు. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.4 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.


అజిత్ కొంత కాలం క్రితం విశ్వాసం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నయన తార , అజిత్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.3 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.


అజిత్ కొంత కాలం క్రితం వివేకం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.7 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ "తునివు" అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: