హైపర్ ఆది చెప్పిందంతా అబద్ధం.. ఆమె ఓలేటి లక్ష్మి కాదు?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం ఎంతో సులభంగా మారిపోయింది అని అనుకుంటున్నారు చాలామంది. ఈ క్రమంలోనే పాపులారిటీ సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఏమి చేయకుండానే ఊహించని రీతిలో ఓవర్ నైట్ లో ఎంతో పాపులర్ అవుతూ ఉన్నారని చెప్పాలి. ఇలా తన వాయిస్ తోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన వారిలో ఓలేటి లక్ష్మీ ఒకరు. ఈమె గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. సోషల్ మీడియా యూస్ చేసే అందరూ కూడా ఈమె వాయిస్ విని ఎంతో బాగా నవ్వుకునే ఉంటారు అని చెప్పాలి.

 ఏకంగా కరోనా వచ్చిందని చెప్పేందుకు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసిన హెల్త్ ఇన్స్పెక్టర్ తో ఆమె సంభాషణలు ప్రతి ఒక్కరిని కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేలా చేసే అని చెప్పాలి. ఏకంగా అమాయకత్వంతో తెలివితనంతో చెప్పిన సమాధానాలు ఆమె మాట్లాడకుండా.. చుట్టుపక్కల వారికి ఫోన్ ఇవ్వడంతో హెల్త్ ఇన్స్పెక్టర్ అసహనానికి లోనై కర్మకొద్దీ దొరుకుతారు జనాలు.. మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయ్యారు రా బాబు అంటూ పంచులు పేల్చడం ఇలా అన్నీ కూడా నవ్వులు పూయించాయి అని చెప్పాలి. అది సరేగాని ఇప్పుడు ఓలేటి లక్ష్మీ గురించి ఎందుకు చర్చ వచ్చింది అని అనుకుంటున్నారు కదా.

 ఇటీవల ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంకు ఓలేటి లక్ష్మీ పేరుతో ఒక మహిళను తీసుకువచ్చారు. అయితే ఇక ఆమెతో కాస్త కామెడీ పంచడానికి ప్రయత్నించారు. ఇక ఓన్లీ ఆడియో మాత్రమే విన్న నెటిషన్లు ఓలేటి లక్ష్మి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి.. ఆమె నిజంగానే ఓలేటి లక్ష్మి అని అనుకున్నారు. కానీ నిజానికి అది అబద్ధం ఆడియన్స్ ని మభ్యపెట్టి రేటింగ్ పొందే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే కృష్ణా జిల్లాకు చెందిన ఓలేటి లక్ష్మి కి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇది చూశాక అసలు ఓలేటి లక్ష్మి ఎవరు అన్న విషయం అందరికీ క్లారిటీ వచ్చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: