ఆ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న బాలకృష్ణ 108వ మూవీ షూటింగ్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. శ్రీకాంత్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా , పూర్ణ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ప్రస్తుతం బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా , దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ  యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే బాలకృష్ణ తన తదుపరి మూవీ ని ప్రారంభించబోతున్నాడు. బాలకృష్ణ తన తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొంద బోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 8 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: