సలార్ తో జూనియర్ కు తిప్పలు !

Seetha Sailaja

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ దర్శకుల లిస్టులో ప్రశాంత్ నీల్ చేరిపోయాడు. కొంతకాలం క్రితం వరకు ఎవరు పట్టించుకోని కన్నడ ఫిలిం ఇండస్ట్రీ రేంజ్ ని ‘కేజీ ఎఫ్’ తో దేశవ్యాప్త స్థాయికి తీసుకుని వెళ్ళిపోవడంతో ఇతడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సెలెబ్రెటీగా మారిపోయాడు.

ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగానికి చెందిన టాప్ హీరోలు అంతా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని ఆరాట పడుతున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘సలార్’ మూవీతో ప్రభాస్ మళ్ళీ టాప్ కలక్షన్స్ హీరోగా మారిపోతాడని అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవానికి ‘సలార్’ మూవీని రెండు భాగాలుగా తీయాలని మొదట్లో ప్రశాంత్ నీల్ అనుకున్నట్లు టాక్.

అయితే ఈమూవీ షూటింగ్ అనుకున్న స్థాయిలో వేగంగా జరగక పోవడంతో ఈమూవీ షూటింగ్ ఇప్పటివరకు కేవలం 50 శాతం మాత్రమే పూర్తి అయింది అని అంటున్నారు. మిగతా సగభాన్ని పూర్తి చేసి అనుకున్న విధంగా వచ్చేఏడాది సెప్టెంబర్ రిలీజ్ డేట్ కు రెడీ చేయాలని ప్రశాంత్ నీల్ పరుగులు తీస్తున్నట్లు టాక్. అయితే ప్రభాస్ ఈమూవీతో కలిపి నాలుగు సినిమాలలో నటిస్తున్న పరిస్థితులలో అతడి డేట్స్ విషయంలో కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

దీనితో ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీ కథను పూర్తిగా ఒకేసినిమాగా పూర్తి చేస్తాడా లేదంటే ఈమూవీకి సెకండ్ పార్ట్ ఉంటుందా అన్న విషయమై ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ‘సలార్’ మూవీకి సెకండ్ పార్ట్ ఉంటే అది వచ్చే సంవత్సరం చివరిలో ప్రారంభం అయి 2024 వరకు కొనసాగే పరిస్థితులలో జూనియర్ ప్రశాంత్ నీల్ తో నటించవలసిన సినిమా గురించి మరో రెండు సంవత్సరాలు వేచి చూడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే కొరటాల శివతో చేయవలసిన మూవీ ప్రాజెక్ట్ ఆలశ్యమైన జూనియర్ కు ప్రశాంత్ నీల్ సినిమా కూడ మరింత ఆలస్యం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: