కష్టపడితేనే సుఖం అంటున్న టబు..?
ఇక తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ ఘాటైన రొమాన్స్ ని ఇప్పటికి పండిస్తూ ఉంటోంది. రొమాన్స్ చేయడంలో యువ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోకుండా తన గ్లామర్ అందామ్ తో రుజువు చేసుకుంటోంది. ఇటీవలే భూల్ భులాయ్యా-2, దృశ్యం-2 వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. తాజాగా ఈ సినిమా విజయాల వెనుక చాలా కష్టం ఉందని గుర్తుచేసింది టబు. గత ఏడాది నర కాలంలో నాలుగు సినిమాలకు విశ్రాంతి లేకుండా నటించానని తెలియజేసింది.
కష్టపడేది ఒక ఛాలెంజ్‌గా తీసుకొని కోవిడ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను అని అయినా సరే వాటిని లెక్కచేయకుండా కష్టపడలని చాలా బలంగా నిశ్చయంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొని నటించారని తెలియజేసింది. హీరోయిన్గా బిజీగా ఉన్నంతకాలం అలాగే పని చేసేదాన్ని అందుకు ఇప్పుడు సుఖ పడుతున్నానని తెలియజేసింది. ప్రస్తుతం టబు చేతిలో నాలుగైదు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది.అలాగే తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే టబు రెమ్యూనరేషన్ విషయంలో మంచి డిమాండ్ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈమెకు వచ్చిన అవకాశాలు కొన్ని వెనిదిరిగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.