హైపర్ ఆది పై సీరియస్ ఐనా రవితేజ...!!

murali krishna
బుల్లితెర స్టార్స్ లో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ వేదికగా ఆది ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈటీవీ ప్రతి ప్రోగ్రాం లో సందడి మొత్తం హైపర్ ఆదిదే.సుడిగాలి సుధీర్ ఈటీవికి దూరమయ్యాక ఆది ప్రయారిటీ మరింత పెరిగింది. మంచి టైమింగ్ కమెడియన్ గా పేరున్న ఆది సిల్వర్ స్క్రీన్ మీద కూడా బిజీ అవుతున్నారు. అలాగే ఢీ డాన్స్ రియాలిటీ షోలో కొన్ని సీజన్స్ గా హైపర్ ఆది యాంకరింగ్ చేస్తున్నారు. ఇక ఢీ సీజన్ 14 గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా మాస్ మహారాజ్ రవితేజ గెస్ట్ గా వచ్చారు.
వేదిక ఏదైనా తన ఎనర్జీ తగ్గదని రవితేజ నిరూపించాడు. అదే సమయంలో హైపర్ ఆదికి తన మార్క్ వార్నింగ్ ఇచ్చాడు. రవితేజకు ఢీ టీం గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కంటెస్టెంట్స్, ఆడియన్స్ పెద్ద ఎత్తున ఈలలతో గోల చేశారు. దీంతో ఇక ఆపండ్రా అని రవితేజ అన్నారు. ఇప్పుడే ఎనర్జీ అయిపోతే ఇంకా డాన్స్ ఏం చేస్తారు. ఆపేయండని కంటెస్టెంట్స్ ని ఉద్దేశించి అన్నారు. అనంతరం రవితేజను చూసిన ఆది…మీ గురించి చెప్పడానికి నాకు అదృష్టం ఉండాలి. మిమల్ని కలిస్తే చాలు అనుకున్న నేను, కలిసి ధమాకా మూవీ చేశాను అన్నాడు.

వెంటనే రవితేజ… నేను కూడా నీతో నటించాలి అనుకుంటున్నాను, అని కౌంటర్ వేశాడు. నాకు తెలియక అడుగుతున్నాను అసలు నీకు ఇక్కడేం పని. ఈ ప్రోగ్రాం తో ఏం సంబంధం అన్నాడు. ఆ మాటకు ఆది తల పక్కకు తిప్పుకున్నాడు. అందరినీ ఆడేసుకుంటావ్. ఇవాళ నీకు మాములుగా ఉండదని, రవితేజ ఆదికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఢీ లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా… ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఇక రవితేజ, ఆది సరదా సంభాషణలు, దుమ్మురేపే డాన్సులు చూడాలంటే ఢీ లేటెస్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వద్దు.రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఢీ ఫినాలే గెస్ట్ గా రవితేజ వచ్చారు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన ధమాకా చిత్ర దర్శకుడు. నవంబర్ 23న గ్రాండ్ గా విడుదల కానుంది. పెళ్లిసందD ఫేమ్ శ్రీలల హీరోయిన్ గా నటించారు. ధమాకా చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. వరుసగా రెండు ప్లాప్స్ చూసిన రవితేజ గ్రేట్ కమ్ బ్యాక్ ఇస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: