చంద్రముఖి మూవీలో ఆ క్రేజీ బాలీవుడ్ నటి... అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజినీ కాంత్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా రజినీ కాంత్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సినిమా లలో చంద్రముఖి మూవీ ఒకటి. చంద్రముఖి మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఈ మూవీ ని చంద్రముఖి అనే పేరుతోనే తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని , అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. చంద్రముఖి మూవీ కి పి వాసు దర్శకత్వం వహించగా , జ్యోతిక , నయన తార , ప్రభు , వడివేలు , నాజర్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే చంద్రముఖి మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ప్రస్తుతం పి . వాసు ఈ మూవీ కి పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీ లో రాఘవ లారెన్స్ హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే చంద్రముఖి 2 లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనోత్ కూడా నటించబోతుంది. ఈ మూవీ లో కంగనా "చంద్రముఖి" పాత్రలో కనిపించబోతుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ బ్యూటీ కంగనా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే ఈ మూవీ లో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది అని కూడా కంగనా తెలియజేసింది. చంద్రముఖి 2 మూవీ షూటింగ్ లో కంగనా వచ్చే నెల నుండి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రముఖి మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం తో చంద్రముఖి 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: