బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ వెనక ఉన్న సీక్రెట్....!!

murali krishna
లారీ డ్రైవర్ ,రౌడీ ఇనస్పెక్టర్ తర్వాత బి గోపాల్ కాంబినేషన్ లో బాలయ్య చేసిన సినిమా సమరసింహారెడ్డి. అప్పటిదాకా కామెడీ ,ఫ్యామిలీ ట్రాక్ తో నడుస్తున్న సినిమాలకు సవాల్ విసురుతూ ఫంక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సమరసింహారెడ్డి మూవీ వెనుక ఎన్నో సీక్రెట్స్ దాగున్నాయి.
బి గోపాల్ ,బాలయ్య కాంబోలో మూడో సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ ఓ కథ రాశారు. అయితే అందులో మాస్ ఎలిమెంట్స్ లేవని ఆ మూవీ పక్కన పెట్టేసారు. అలా వదిలేసిన ఆ మూవీ కోదండ రామిరెడ్డి చేతిలోకి వెళ్లడంతో బాలయ్య హీరోగా చేసి హిట్ కొట్టారు. అదే బొబ్బిలి సింహం. అయితే పల్నాడు ఫ్యాక్షన్ లో విజయేంద్ర ప్రసాద్ రాసిన మరో కథను సీమ బ్యాక్ డ్రాప్ లో చేయాలనీ కథను అందుకు అనుగుణంగా బి గోపాల్ మార్చమన్నాడు.
అలా రూపొందాక సూపర్ గా నచ్చేయడంతో పరుచూరి బ్రదర్స్ ని ఎంటర్ చేసారు. ఓ హోటల్ కూర్చుని వారికి కథ చెప్పడంతో ఇంటర్వెల్ ముందు బాలయ్యకు సత్యనారాయణ నమస్కారం పెట్టె సీన్ అనుకున్నారట. కానీ పరుచూరి బ్రదర్స్ దాన్ని ఫస్టాఫ్ మిడిల్ లో చేర్చారు. నిజానికి సత్యనారాయణ,బ్రహ్మానందానికి క్యారెక్టర్స్ లేవు.
గోపాల్ పట్టుబట్టి వారికిక్యారెక్టర్స్ రాయించారు. సమర సింహం అనే టైటిల్ పెట్టాలని గోపాల్ ,విజయేంద్ర ప్రసాద్ అంటే, పరుచూరి బ్రదర్స్ మాత్రం సమరసింహారెడ్డి పెట్టమన్నారు. సమర సింహం అంటే ఓ జంతువు. వేటాడడమే తెల్సు. కానీ సమరసింహారెడ్డి అనగానే మనిషి,వేట,విచక్షణ రెండూ ఉంటాయని పరుచూరి చెప్పడంతో అందరూ సైలెంట్ అయ్యారు. రాశి,సంఘవి,అంజలి జవేరి ఈ ముగ్గురినీ హీరోయిన్స్ అనుకున్నారు.
అయితే సీతాకోక చిలుక సీన్ కి రాశి నో అనడంతో సిమ్రాన్ ని తీసుకున్నారు. వాసు క్యారెక్టర్ కి పృథ్వి ఫైనల్ అయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా మొదలైన షూటింగ్ హోటల్ సీన్,క్లైమాక్స్ సీన్స్ రామోజీ ఫిలిం సిటీలో తీశారు. అవుట్ డోర్ కర్నూల్ ,విజయనగరం, బొబ్బిలి లలో తీశారు. కొత్తవలస రైల్వే స్టేషన్ లో స్టేషన్ సీన్ తీయడంతో బాలయ్యను చూడ్డానికి వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేసారు.
84రోజుల్లో 6కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ కి మణిశర్మ మ్యూజిక్ అదిరింది. 1999జనవరి 13న విడుదలైన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్స్ సునామీ సృష్టించింది. 30కేంద్రాలకు పైనే 175రోజులు ఆడిన సూపర్ హిట్ మూవీ ఇది. తొలిసారి 20కోట్ల గ్రాస్ వసూలు చేసిన మూవీ. 10,15రూపాయల టికెట్ రేట్స్ తో 16కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తమిళంలో షణ్ముఖ పాండియన్ గా, హిందీలో రఖ్ వాలాగా డబ్ అయింది. బాలయ్యకు కమీషనర్ హోదాలో సత్యనారాయణ నమస్కారం చేసే సీన్ గురించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతగానో ఫిదా అయ్యాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: