సుడిగాలి సుధీర్ మ్యానియాకు షాక్ లో ఇండస్ట్రీ !

Seetha Sailaja
ప్రస్తుతం విమర్శకులు మంచి రేటింగ్స్ ఇస్తున్నా సినిమాలకు మంచి పబ్లిసిటీ చేస్తున్నా చాల మీడియం రేంజ్ చిన్న సినిమాలు కనీసపు కలక్షన్స్ ను కూడ తెచ్చుకోలేకపోతున్నాయి. దీనితో ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో తెలియని కన్ఫ్యూజన్ లో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి.

ఇండస్ట్రీ ఆమోదపు ముద్ర పొందడమే కాకుండా మంచి నటుడుగా పేరుగాంచిన సుధీర్ బాబు విశ్వక్ సేన్ అల్లరి నరేష్ అల్లు శిరీష్ మంచు విష్ణు శ్రీవిష్ణు లాంటి హీరోల సినిమాల లేటెస్ట్ సినిమాలకు మంచి టాక్ వచ్చినప్పటికీ కనీసపు కలక్షన్స్ కూడ తెచ్చుకోలేకపోవడంతో ఆమూవీలను కొనుక్కున్న బయ్యర్లు తీసిన నిర్మాతలు నష్టపోయిన సందర్భాలకు సంబంధించిన వార్తల హడావిడి ఇండస్ట్రీలో జరిగింది.

అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం బుల్లితెర ఇమేజ్ పై ఆధారపడి సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ ‘గాలోడు’ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు లాభం పొందారు అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. వాస్తవానికి ‘గాలోడు’ విడుదలకు ముందు ఆమూవీని ఎంత తక్కువ రేట్లకు అమ్మినప్పటికీ ఆమూవీని మార్కెట్ చేయడం చాల కష్టం అయింది అని అంటారు.

ఉదాహరణకు ఉత్తరాంద్ర ప్రాంతానికి చెందిన ఒక బయ్యర్ కు ఈమూవీ నిర్మాతలు ఎంతో కష్టపడి ఒప్పించి 40 లక్షలు మొత్తానికి అమ్మితే ఆమూవీకి ఊహించని విధంగా మంచి ఓపెనింగ్ కలక్షన్స్ రావడంతో పాటు ఈమూవీ బయ్యర్ కు మొదటి వారం పూర్తి అయ్యేసరికి 70 లక్షలకు పైగా కలక్షన్స్ రావడంతో ఈమూవీ ఉత్తరాంద్ర బయ్యర్లు చాల హ్యాపీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఒక టాప్ యంగ్ హీరో సినిమాను కొనుక్కున్న బయ్యర్ కు లాభాలు రావాలి అంటే కనీసం రెండు వారాలు సమయం పట్టే పరిస్థితి. అలాంటిది ‘సుడిగాలి’ సుధీర్ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు మొదటివారంలోనే లాభాల బాట పట్టిన మాటలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ లో ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: