సమంత ఆరోగ్యం మరింత విషమించిందా...?

murali krishna
సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. లేచి నిల్చో లేని పరిస్థితులో కూడా లేనని తన వ్యాధి లక్షణాల గురించి సమంత తెలిపింది.

యశోద ప్రమోషన్స్ కోసం అతి కష్టం మీద ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా చేసింది. అయితే సమంత ఈ వ్యాధితో పోరాడేందుకు చాలానే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం సమంత మీద రకరకాల రూమర్లు అయితే పుట్టిస్తూనే ఉన్నారట కొంత మంది.

తాజాగా సమంత ఆరోగ్యం క్షీణించిందని, విషమంగా మారిందని, అందుకే దక్షిణ కొరియాకు సమంతను తీసుకెళ్తోన్నట్టుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిపై సమంత టీం కూడా స్పందించింది. ఇవన్నీ పుకార్లేనని ఆమె వ్యక్తిగత టీం కొట్టిపారేసింది. సమంత దక్షిణ కొరియా వెళ్లడం ఏంటని? అసలు ఇలాంటి పుకార్లు ఏ సమాచారం లేకుండా ఎలా పుట్టిస్తారని మండిపడింది. సమంత ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉందని, ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని విశ్రాంతి తీసుకుంటూ సంతోషంగా ఉందని క్లారిటీగా అయితే టీం చెప్పిందంటూ మీడియాలో మళ్లీ వార్తలు కూడా ప్రచారం సాగుతున్నాయి.

మొత్తానికి సమంత ఆరోగ్యం మీద ఇలా రూమర్లు రావడం, టీం ఖండించడం కూడా ఇది వరకు జరిగింది. కానీ చివరకు సమంత తనకు తాను గానే ఇలా మయోసైటిస్‌తో బాధపడుతున్నానంటూ చెప్పుకొచ్చిందట.. సమంత ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటోంది. ఆమె నటించిన శాకుంతలం విడుదలకు రెడీగా ఉండగా.. ఖుషి సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.

సమంత నటించిన యశోద సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సమంత నటనకు అందరూ కూడా ఫిదా అయ్యారు.ఆమె చేసిన యాక్షణ్ సీక్వెన్స్‌కు జనాలు అవాక్కయ్యారు. ఇక యశోద చుట్టూ వివాదాలు కూడా ఎక్కువే అయ్యాయి. ఈవా అని తమ సంస్థ పేరుని వాడారంటూ ఐదు కోట్ల దావా వేసిన కేసు అందరికీ కూడా తెలిసిందే. చివరకు దాన్ని నిర్మాతతో కలిసి సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. యశోద సినిమాలో ఇకపై ఆ పేరు ఉండదని, తొలగిస్తామని నిర్మాతలు కూడా హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: