అలాంటి జోనర్లో శేఖర్ కమల... ధనుష్ మూవీ..?

Pulgam Srinivas
టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల రాజా హీరోగా కమిలిని ముఖర్జీ హీరోయిన్ గా తెరకెక్కిన ఆనంద్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తర్వాత గోదావరి  , హ్యాపీ డేస్ , లీడర్ , అనామిక ,  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ , ఫిదా ,  లవ్ స్టోరీ మూవీ లకు దర్శకత్వం వహించి , దర్శకత్వం వహించిన మూవీ లలో ఎక్కువ శాతం మూవీ లతో మంచి విజయాలను అందుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు గా పేరు తెచ్చుకున్నాడు.

శేఖర్ కమల ఆఖరుగా నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే శేఖర్ కమ్ముల కోలీవుడ్ హీరో ధనుష్ తో ఒక మూవీ చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... శేఖర్ కమల మరియు ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ స్కాం ద్రిల్లర్ జోనల్ లో రూపొంద బోతున్నట్లు , ఈ మూవీ లో ధనుష్ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నట్లు ,  అలాగే ఒక బలమైన విలన్ పాత్ర ఈ మూవీ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ,  ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: