రామ జన్మస్థలి అయోధ్యకు వెళుతున్న "హనుమాన్"..!

Divya
ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న హనుమాన్ సినిమా ఇప్పటికే ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తుండగా సూపర్ హీరో మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి ట్రేమెండస్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా పక్కా విజయాన్ని సాధిస్తుంది అని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.. సినిమా నుంచి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా తాము ఈ చిత్రం సక్సెస్ అవుతుందని ముందుగానే చెబుతున్నాము అంటూ తమ ఆలోచనలను మీడియాతో వెల్లడించారు.

తాము ఈ సినిమాను ఎంతో కష్టపడి చేస్తున్నామని.. ప్రేక్షకులు తమ కష్టాన్ని గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని కూడా చిత్ర యూనిట్ తెలిపింది.  అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడానికి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే రాముడి అపర భక్తుడైన హనుమాన్ తన సినిమా నేపథ్యం కావడంతో శ్రీరాముడి దీవెనలు తీసుకోవడానికి నేడు హనుమాన్ బృందం శ్రీరామ జన్మస్థలి అయిన అయోధ్యకు వెళుతున్నారు. నవంబర్ 29వ తేదీన హనుమాన్ చిత్ర యూనిట్ అయోధ్యకు పయనం అవుతున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో హీరోగా జాంబిరెడ్డి ఫేమ్ తేజ సజ్జ నటిస్తుండగా.. హీరోయిన్గా అమృత అయ్యర్ నటిస్తోంది. కే నిరంజన్ రెడ్డి ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటిస్తాము అని తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు ఈ సినిమా పొందుతుంది అని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమాకు యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ సినిమా గట్టి పోటీ ఇవ్వనుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: