పవన్ కళ్యాణ్ కు డైరెక్టర్లపై నమ్మకం లేదా..?

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. " అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి " సినిమాతో వెండితెరకు పరిచయమై.. అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో జానీ సినిమాను తెరకెక్కించి పూర్తి బోల్తా పడ్డారు. ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వానికి పుల్ స్టాప్ పెట్టిన పవన్ కళ్యాణ్ .. ఆ తర్వాత తన సినిమా కథలకు స్క్రిప్టు రైటర్ గా పనిచేస్తూ హీరోగా తన సత్తా చాటాడు.

అయితే ఆ తర్వాత కొన్ని రోజులు ఊహించిన స్థాయిలో విజయాలు అందకపోయేసరికి జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వెళ్లిపోయారు.  అయితే గత ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ పెద్దగా విజయం సాధించని పవన్ కళ్యాణ్ ..ఇప్పుడు ఎలాగైనా సరే జనసేన పార్టీని అధికారంలోకి  తేవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా వైయస్సార్ పార్టీని అణచివేయడానికి అటు బిజెపి,  ఇటు టిడిపి లతో చేయికలిపి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.  కానీ ఏది కూడా ఆయనకు కలిసి వచ్చే విధంగా కనిపించడం లేదు. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు తన చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టారు.
తాజాగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నారు.  అయితే ఇందులో స్క్రిప్ట్ కూడా సరిగ్గా లేదని ఆయన దర్శకుడి తో స్క్రిప్టు మొత్తం మార్చాలని కూడా చెప్పాడట.ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన తదుపరి ప్రాజెక్టు కోసం స్వయంగా తానే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.  అయితే దర్శకుల కథలపై ఆయనకు నమ్మకం లేకపోవడం వల్లే ఇలా తన తదుపరి చిత్రానికి ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: