"హిట్ 2" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేయనున్న ఆ స్టార్ డైరెక్టర్..!

Pulgam Srinivas
టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి శైలేష్ కొలను తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలెంటెడ్ నటుడు అయినటు వంటి అడవి శేషు హీరోగా నటించగా , అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఈ మూవీ లో అడవి శేష్ సరసన హీరోయిన్ గా నటించింది. నాని ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది.
 

సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు "ఏ" సర్టిఫికెట్ లభించగా , ఈ మూవీ ని 2 గంటల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు మూవీ యూనిట్ తీసుకురానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 28 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి కాన్వెన్షన్, హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కొనసాగుతున్న ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: