బాస్ ని మ్యాచ్ చేయడానికి కష్టపడుతున్న ఊర్వశి..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస మూవీ లతో ఫుల్ జోష్ ను చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ ఒక కీలకపాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే అక్టోబర్ 5 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీ విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం చిరంజీవి బాబి దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్  లో తిరగేకుతున్న పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్యలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా , రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇలా ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా నుండి చిత్ర బృందం బాస్ పార్టీ అనే సాంగ్ ను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ విడుదల అయిన నిమిషాల్లోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఊర్వశి రౌటేలా స్టెప్ లు వేసింది. తాజాగా ఊర్వశి రౌటేలా తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఊర్వశి రౌటేలా , మెగాస్టార్ చిరంజీవికి సరి సమానంగా స్టెప్పులేసేందుకు ప్రాక్టీస్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: