"వాల్తేరు వీరయ్య" బాస్ పార్టీ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు బాబి అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య మూవీ ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఏ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో పూర్తి చేస్తుంది.

మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం.  తాజాగా ఈ మూవీ నుండి బాస్ పార్టీ అనే సాంగ్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ కు విడుదల అయిన నిమిషాల్లోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సాంగ్ కి మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్ లు , ఊర్వశి రౌటేలా అంద చందాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. దానితో బాస్ పార్టీ సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో 9.51 మిలియన్ వ్యూస్ ను ,  250.6 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే వాల్తేరు వీరయ్య మూవీ లోని బాస్ పార్టీ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల తర్వాత నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: