గుండెల్ని పిండేసే ప్రేమకథతో "కలర్ ఫోటో" రచయిత !

VAMSI
కరోనా టైం లో మన ముందుకు వచ్చిన అద్భుతమైన ప్రేమకథగా ప్రేక్షకుల మన్ననలను అందుకున్న సినిమా "కలర్ ఫోటో". ఈ సినిమా ఆహా ఓటిటి లో విడుదలైంది.. ఇందులో ఇంతకు ముందు సినిమాలలో సహనటుడిగా నటించి మెప్పించిన సుహాస్ హీరోగా మరియు తెలుగమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకునే రీతిలో కథ మరియు సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాను రచించిన సాయి రాజేష్ కూడా ప్రేమికుడా అన్న విధంగా ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా ఉంది సినిమా.
ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... నిన్న ఒక కొత్త సినిమా టీజర్ ను విడుదల చేసింది సాయి రాజేష్ టీం.. ఈ సినిమాకు బేబీ అన్న టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా టీజర్ లోనూ కలర్ ఫోటో లాగా పోలికలు ఉండడంతో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయింది. కలర్ ఫోటో లో ఒక నల్లని అబ్బాయి అందంగా ఉన్న పెద్దింటి పిల్లను ప్రేమిస్తాడు. కానీ బేబీ లో నల్లని అమ్మాయిని అందమైన అబ్బాయి ప్రేమిస్తాడు. అందులోనూ కలర్ ఫోటో రైటర్ గా పనిచేసిన సాయి రాజేష్ ఈ సినిమాకు రైటర్ మరియు దర్శకుడు కావడంతో ఆ సందేహం నెలకొంది. కానీ ప్రేమకథలు చాలా రకాలు ఉంటాయి.
స్వచ్ఛమైన ప్రేమను ఏ విధంగా చూపించినా, ఏ తరంలో అయినా ఈ ప్రేమకథలను ఆదరించే ప్రేక్షకులు ఉండనే ఉంటారు. ఇందులో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా విషాదకరంగా ఉండనుంది అని తెలుస్తోంది. మరి కలర్ ఫోటో నే తిప్పి చూపించాడా లేదా మరో గుండెల్ని పిండేసే కథను మనకు సాయి రాజేష్ పరిచయం చేయనున్నాడా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: