"హిట్ 3" మూవీలో ఆ ముగ్గురు క్రేజీ హీరోలు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు పొందిన దర్శకులలో ఒకరు అయినటు వంటి శైలేష్ కొలను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు విశ్వక్ సేన్ హీరోగా నాచురల్ స్టార్ నాని నిర్మాణం లో తలకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. తాజాగా ఈ దర్శకుడు హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా హిట్ ది సెకండ్ కేస్ అని మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కి నాచురల్ స్టార్ నాని నిర్మాత గా వ్యవహరించగా , ఈ మూవీ లో అడవి శేషు హీరో గా నటించాడు.

మీనాక్షి చౌదరి ఈ మూవీ లో అడవి శేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిట్ ది సెకండ్ కేస్ మూవీకి కొనసాగింపుగా హిట్ 3 మూవీ ని రూపొందించ బోతున్నట్లు ఇప్పటికే ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యింది.

అలాగే హిట్ 2 మూవీ చివరలో హిట్ 3 లో ఎవరు హీరోగా కనిపించబోతున్నారు అనే విషయాన్ని కూడా చెప్పబోతున్నట్లు అడవి శేషు తాజాగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హిట్ 3 మూవీ లో అడవి శేషు తో పాటు నాచురల్ స్టార్ నాని , విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: