హనుమాన్ టీజర్ అదుర్స్.. ఆదిపురుష్ పై మళ్ళీ ట్రోల్స్?

Purushottham Vinay
మరోసారి బాలీవుడ్ ని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్‏ను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఆదిపురుష్ సినిమా టీజర్‏ను తాజాగా విడుదలైన హనుమాన్ సినిమా టీజర్‏తో పోలుస్తూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.సినిమాకి బడ్జెట్ కాదు ముఖ్యం.. ప్రజెంటేషన్ చాలా ముఖ్యమంటూ సలహాలు ఇస్తున్నారు. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా ఎదిగిన తేజా సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం హనుమాన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ సోమవారం విడుదల చేశారు మేకర్స్. ఇందులో వీఎఫ్ఎక్స్ ఇంకా అలాగే ప్రెజెంటేషన్‏ను మెచ్చుకుంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఈ టీజర్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ సినిమా టీజర్‎తో పోలూస్తూ ఆది పురుష్  టీంని తెగ ట్రోల్ చేస్తున్నారు. హనుమాన్ టీజర్ ఆదిపురుష్ టీజర్ వీఎఫ్ఎక్స్ కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని.. చాలా తక్కువ బడ్జెట్‏లోనే ఎంతో అద్భుతంగా తెరకెక్కించారంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ హనుమాన్ సినిమాని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు.


అంజనాద్రి అనే కాల్పనిక గ్రామం నేపథ్యంలో ఈ సినిమాని తీసుకువస్తున్నారు. ఈ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విలువైన ఓ మణి కోసం సాగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కినట్లు కనిపిస్తోంది. హనుమాన్‌ భారీ విగ్రహాన్ని చూపించిన విధానం అయితే అద్భుతంగా ఉంది. కేవలం 1.41 నిమిషాల నిడివి ఉన్న టీజర్‌ ఆద్యంతం అద్భుతంగా ఉంది. తెలుగుతో పాటు మిగతా భాషల్లో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. అబ్బుపరిచే విజువల్స్‌తో ఉన్న ఈ టీజర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్నారు. ముందు నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ .. సైఫ్ అలీ ఖాన్ లుక్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఇక హనుమాన్ టీజర్ రాకతో ఇంకా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఆది పురుష్ కి ఇంకా టైం ఉండటంతో చాలా మార్పులు చేస్తున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: