నువ్వు ఎవరో తెలీదు.. స్టార్ హీరోకే షాక్ ఇచ్చిన రిపోర్టర్?

praveen
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరితో పోల్చి చూస్తే అల్ట్రా మోడ్రన్ డ్రెస్సింగ్ స్టైల్ లో ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటాడు రణ్ వీర్ సింగ్. అంతేకాదు పది రెడ్ బుల్స్ ఒకటేసారి తాగేసాడేమో అన్నంతగా ఎంతో ఎనర్జీతో కనిపిస్తూ ఇక మిగతా వాళ్లలో కూడా ఎనర్జీ నింపుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక రణ్ వీర్ సింగ్  లో ఉండే ఈ దూకుడు తనమే అందరికీ ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. అయితే బాలీవుడ్లో స్టార్ హీరో అయినప్పటికీ అతను అందరికీ కూడా ఎంతో గౌరవం ఇస్తూ మంచి మనసుతో కనిపిస్తూ ఉంటాడు. అందుకే రణ్ వీర్ సింగ్ కేవలం బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా కోట్ల మంది ప్రేక్షకులు అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 మొన్నటికి మొన్న రాఖీ ఔర్ రానీకి ప్రేమ్ కహాని అనే సినిమా షూటింగ్ తో బిజీబిజీగా గడిపిన రణ్ వీర్ సింగ్ ఇక ఇప్పుడు అబీ దాబీలోకి అడుగు పెట్టాడు అని చెప్పాలి. అక్కడ జరిగే ఎఫ్ వన్ రేసులను చూసేందుకు వెళ్లిన రణ్ వీర్ సింగ్ ఎల్లో డ్రెస్ లో ఎప్పటిలాగానే అందరికంటే డిఫరెంట్ గా తన డ్రెస్సింగ్ స్టైల్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు అని చెప్పాలి. అయితే ఇలా ఎఫ్ వన్ రేస్ లో ఉండే వైబ్ ని ఎంజాయ్ చేస్తున్న రణ్ వీర్ సింగ్ కి ఒక జర్నలిస్టు నుంచి మాత్రం ఊహించని షాక్ తగిలింది   సాధారణంగానే రణ్ వీర్ సింగ్ అంటే తెలియని వారు ఉండరు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక రిపోర్టర్ మాత్రం నువ్వు ఎవరో తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 అక్కడ ఉన్న ఒక స్పోర్ట్స్ రిపోర్టర్ రణ్ వీర్ సింగ్ తో మాట్లాడుతున్న సమయంలో నువ్వు ఎవరో మర్చిపోయాను.. గుర్తు చేయగలవా అంటూ అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు అటు రణ్ వీర్ సింగ్ ఎక్కడ చిరాకు పడకుండా ఎంతో నవ్వుతూనే స్పోర్టివ్ గా తీసుకున్నాడు. నేను బాలీవుడ్ నటుడిని నేను ముంబై ఇండియా నుంచి వచ్చాను. నేను ఒక ఎంటర్టైనర్ ని అంటూ తనను తాను మళ్ళీ పరిచయం చేసుకున్నాడు ఈ స్టార్ హీరో. తన బట్టల పై తానే జోక్ వేసుకుంటూ రేపు ఉదయమే ఈ బట్టలను వెనక్కి ఇచ్చేయాలి అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక ఈ వీడియో వైరల్ గా మారగా ఇది చూసిన ఎంతోమంది ఫాన్స్ రణ్ వీర్ సింగ్ అంటే ఇది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: