"ఆర్ సి 16" మూవీ పై క్రేజీ అప్డేట్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ కొన్ని రోజుల క్రితమే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును కూడా దక్కించుకున్నాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని , అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తేరకేక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో , ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో , ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ఈ మూవీ లో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ జై సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి , సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రల్లో కనిపించనుండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ ఈ మూవీ తర్వాత నటించబోయే మూవీ కి సంబంధించిన పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన తదుపరి మూవీ ని ఉప్పెన మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సతీష్ కిలారు అనే నిర్మాత , కొత్త బ్యానర్ ద్వారా ఈ మూవీ ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 16 మూవీ గా రూపొందబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: