రేపు ఆ టైమ్ కి విడుదల కానున్న "18 పేజెస్" మూవీ సాంగ్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇలా కార్తికేయ 2 మూవీ తో అద్భుతమైన విజయాన్ని ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కార్తికేయ 2  లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు.
 

కొన్ని రోజుల క్రితమే 18 పేజెస్ మూవీ నుండి "నన్నయ్య రాసిన" అనే సాంగ్ ను నవంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రేపు అనగా నవంబర్ 22 వ తేదీన "నన్నయ్య రాసిన" అనే సాంగ్ ను సాయంత్రం 4 గంటల 32 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సాంగ్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: