రీమేక్ లను పట్టించుకోని ప్రేక్షకులు !

Seetha Sailaja

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో రీమేక్ ల సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. ఒకనాటి సీనియర్ హీరోలు అక్కినేని నందమూరిల కాలం నుండి నేటితరం టాప్ హీరోల వరకు చాలామంది హీరోలు రీమేక్ సినిమాలలో నటించి ఘన విజయాలు సాధించారు. అయితే నేటితరం ప్రేక్షకులకు రీమేక్ లపై ఆశక్తి తగ్గుతోందా అన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలలో కలుగుతోంది.

దీనికికారణం గతకొంత కాలంగా మన టాప్ హీరోలు నటిస్తున్న రీమేక్ మూవీలు అంతంత మాత్రంగానే విజయవంతం అవ్వడంతో ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. 'అయ్యప్పనమ్ కోశియుమ్' రీమేక్ గా పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేడు. అదేవిధంగా పవన్ ‘వకీల్ సాబ్’ పరిస్థితి కూడ అని అంటారు. ఇక దసరా సమయంలో విడుదలైన ‘లూసీఫర్’ రీమేక్ 'గాడ్ ఫాదర్' సినిమాకి కూడా బాక్సాఫీస్ వద్ద ఒక మాదిరి ఫలితమే దక్కింది.


బాలీవుడ్ లో 'గద్దలకొండ గణేష్' రీమేక్ గా అక్షయ్ కుమార్ రూపొందిన 'బచ్చన్ పాండే' షాహిద్ కపూర్ చేసిన 'జెర్సీ' రీమేక్ హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన 'విక్రమ్ వేదా' రీమేక్ లు కూడ ఫెయిల్ అయ్యాయి.  లేటెస్ట్ గా వచ్చిన వెంకటేష్ 'ఓరి దేవుడ' కూడ రీమేక్. ఇలా ఈ సంవత్సరం విడుదలైన రీమేక్ సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈ ట్రెండ్ అన్ని భాషలలోను కొనసాగింది. ఇలా జరగడానికి గల కారణం ఈ రీమేక్ సినిమాలకు మాతృక అయిన అసలు సినిమాలను ప్రేక్షకులు ఓటీటీ లలో ఇప్పటికే చూడటంతో ఈ రీమేక్ సినిమాల పై ప్రేక్షకులలో ఆశక్తి కనపరచలేదు.

అనేక రీమేక్ సినిమాలు ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. ఓటీటీలో వైవిధ్యమైన కంటెంట్ ను చూడటానికి అలవాటు పడిపోయిన జనాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూపొందుతున్న చిత్రాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అందుకే ఆల్రెడీ చూసేసిన కంటెంట్ ని వినోదం కోసం మళ్ళీ థియేటర్ కు వచ్చి సమయం మరియు డబ్బు వెచ్చించే పరిస్థితి లేదని అందరూ గ్రహించాలి. ప్రస్తుతం ప్రేక్షకులు ఒరిజినల్ కంటెంట్ ని ఉత్తేజకరమైన సినిమాలను మాత్రమే ఇష్టపడుతున్నారు. ఈవిషయాన్ని ఇప్పటికే గ్రహించిన కన్నడ మళయాళ సినిమా రంగాలు రీమేక్ లను చేయడం పూర్తిగా తగ్గించి వేసారు..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: