అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కమల్ హాసన్ "విక్రమ్" మూవీ..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి సూర్య ఈ మూవీ లో చిన్న గెస్ట్ రోల్ లో నటించగా , మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయిన ఫాహాద్ ఫాజిల్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న విజయ్ సేతుపతి ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

ఇలా హేమాహేమీలు అయిన నటీ నటులు ఈ మూవీ లో నటించడంతో ఈ మూవీ విడుదలకు ముందే ప్రేక్షకులు విక్రమ్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాలు నడుమ ఈ సినిమా కొంత కాలం క్రితమే తమిళ్ , తెలుగు ,  మలయాళం , కన్నడ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తమిళ భాషలో బుల్లితెరపై ప్రసారం అయింది.

మొదటి సారి తమిళ వర్షన్ విక్రమ్ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కేవలం 4.42 "టి ఆర్ పి" రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా విక్రమ్ సినిమా మలయాళ వర్షం మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 8.24 "టి ఆర్ పి" రేటింగ్ ని సొంతం చేసుకుంది.  దీనితో విక్రమ్ సినిమా మలయాళ ప్రేక్షకులను అద్భుతమైన రేంజ్ లో ఆకట్టుకున్నట్లు అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: