డైరెక్ట్ గా "ఓటిటి" విడుదల కానున్న కియారా అద్వానీ కొత్త సినిమా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ మూవీ ల ద్వారా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ తెలుగు లో కూడా పలు మూవీ లలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం లభించింది. దానితో ఆ వెంటనే కియారా అద్వానీ కి  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో అవకాశం లభించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వినయ విధేయ రామ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మళ్ళీ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టి , బాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక మూవీ లలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా కియారా అద్వానీ  "గోవింద నామ్ మేరా" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.  విక్కీ కౌశల్ ఈ మూవీ లో హీరోగా నటించాడు. భూమి పెడ్నేకర్ ఈ మూవీలో మరో హీరోయిన్ గా నటించింది. ధర్మ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ ద్వారా నిర్మించబడిన ఈ మూవీ కి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని డిసెంబర్ 16 వ తేదీన డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో డైరెక్ట్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: