బాలయ్య అభిమానులకు శుభవార్త.. కొత్త మూవీ లాంఛింగ్ డేట్ ఖరారు.!

Divya
ఆరు పదుల వయసులో కూడా నందమూరి బాలకృష్ణ ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈయన నటించిన అఖండ సినిమా ఇందుకు నిదర్శనమని చెప్పాలి. కుర్ర హీరోలు కూడా ఈయన విజయాన్ని చూసి కుళ్ళు కుంటున్నారు. ఈ వయసులో కూడా తన నటనతో.. ప్రేక్షకులను మెప్పించిన బాలయ్య వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతూ ఉండడం చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా అఖండ సినిమా తర్వాత క్రాక్ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన #NBK 107 వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ సినిమాకు వీరసింహారెడ్డి టైటిల్ తో పూర్తిస్థాయిలో షూటింగ్ జరుపుకుంటోంది.  ఇటీవల అనంతపురం జిల్లాకు సంబంధించి పలు ప్రాంతాలలో వీరసింహారెడ్డి క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది.  ఈ సినిమా సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమా భోళా శంకర్ కి  పోటీగా నిలవనుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి కొన్ని యాక్షన్ సీన్స్ లీక్ అవ్వగా అభిమానులకు పూర్తిస్థాయిలో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.  మరి ఏ రేంజ్ లో ఈ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.
మరొకవైపు బాలకృష్ణ ఎఫ్ 3 మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. #NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..  ఈ సినిమాను డిసెంబర్ 8న లాంచింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణకు కూతురు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది కాబట్టి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతము ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: