వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల కాబోయే క్రేజీ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో దసరా , దీపావళి , సంక్రాంతి తర్వాత ఆ రేంజ్ లో సినిమాలు విడుదల అయ్యే సీజన్ సమ్మర్ అని చెప్పవచ్చు. సమ్మర్ లో కూడా స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఆ సమయంలో స్కూల్స్ , కాలేజెస్ కు హాలి డేస్ ఉండడం తో యువత ఎక్కువగా సినిమాలను చూడడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. దానితో సినిమా ఇండస్ట్రీ లోని హీరోలు , దర్శకులు , నిర్మాతలు కూడా సమ్మర్ లో తమ సినిమాలను విడుదల చేయడానికి ప్రాణాలికలను వేస్తూ ఉంటారు. అలాగే వచ్చే సంవత్సరం సమ్మర్ కి కూడా కొన్ని సినిమాలను విడుదల చేయనున్నారు. అలా వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల కావడానికి రెడీ గా ఉన్నా కొన్ని మూవీ ల వివరాలను తెలుసుకుందాం.


నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న దసరా మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన హరి హర వీర మల్లు మూవీ ని మే రెండవ వారంలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. హరి హర వీర మల్లు మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమాలు వచ్చే సమ్మర్ లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: